122వ రోజు అశేష జనవాహిని మధ్య యువగళం

122వ రోజు అశేష జనవాహిని మధ్య యువగళం
జంగాలపల్లె ఆంజనేయస్వామి గుడి వద్ద క్యాంప్ సైట్ నుంచి 122వ రోజు పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. టీడీపీ యువనేత నారా లోకేష్‌కు అన్న వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న లోకేష్‌కు భారీగా మద్దతు తెలుపుతున్నారు. లోకేష్ పాదయాత్రలో మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. జంగాలపల్లె ఆంజనేయస్వామి గుడి వద్ద క్యాంప్ సైట్ నుంచి 122వ రోజు పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. మరికాసేపట్లో బద్వేలు నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ఎంటర్‌ కానుంది. అట్లూరు క్రాస్ వద్దకు చేరుకోగానే లోకేష్ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. 6 గంటల 20 నిమిషాలకు నదియాబాద్ విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story