151మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రభుత్వం విర్రవీగుతోంది

ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రభుత్వం చులకనగా చూస్తోందని వైసీపీ నేతలు ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించింది ఏపీ జేఏసీ అమరావతి. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రభుత్వం విర్రవీగుతోందని, ప్రతి ఉద్యోగి భుజం భుజం కలిపి ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవంది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి మూడోదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ‘ఉద్యోగులంతా కదలి రావాలని మౌనం వహిస్తే భవిష్యత్తులో నెలవారీగా జీతాలు తీసుకోవడమే కష్టమవుతుందన్నారు ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. మూడోదశ ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక్కో ఉద్యోగి లక్షల్లో బకాయిలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ నెల 8 నుంచి జూన్ 8 వరకు జరిగే ఉద్యమంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 8 నుంచి జూన్ 8 వరకు మూడో దశ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి పాల్గొంటారని తెలిపారు బొప్పరాజు. 8వ తేదీన ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు, సస్పెన్షన్లను ఉపసంహరించాలని, వేధింపులను విడనాడాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. జిల్లాల కలెక్టర్లకు స్పందనలో వినతులు. ఇస్తామని తెలిపారు. మే 9న: శ్రీకాకుళంలో మొదటి ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తామని, మే 12 - 19 వరకు 175 మంది ఎమ్మెల్యేలను, 25 మంది ఎంపీలను కలుస్తామన్నారు. మే 17న అనంతపురంలో రెండో ప్రాంతీయ సదస్సు 27న ఏలూరులో మూడో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకరోజు సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించి జూన్ 8న గుంటూరులో నాలుగో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com