1998లో లంచం.. వృద్ధాప్యంలో జైలు శిక్ష

లంచం డిమాండ్ చేసిన కేసులో ఓ రిటైర్డ్ MPDOకు 80 ఏళ్ల వయసులో జైలుశిక్ష పడింది. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎంపీడీవో తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 25 సంవత్సరాల కిందట ACB నమోదు చేసిన కేసులో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. గరిష్ఠ శిక్షలు కాకుండా కనిష్ఠ శిక్షలు విధించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్-7 కింద 6 నెలల కఠిన కారాగార శిక్ష, 5వేల జరిమానా విధించింది. MPDOను నిరపరాధిగా ప్రకటిస్తూ ఏసీబీ కోర్టు 2005లో ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈమేరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం జీతం బకాయిలు ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు శేషారావు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అప్పటి ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావును ఆశ్రయించారు. ఇందుకోసం ఎంపీడీవో 5వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు శేషారావు. 1998 ఏప్రిల్‌లో MPDO లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. అయితే విజయవాడ ACB కోర్టు ఈ కేసును విచారించి MPDOను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ACB 2007లో హైకోర్టుకు వెళ్లింది. అప్పటికి MPDO వయసు 64 ఏళ్లు. కేసుపై విచారణ జరిపిన హైకోర్టు....ACB కోర్టు తీర్పును రద్దు చేసింది. ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావుకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com