శ్రీకాకుళంలో నాటుసారా తాగి 20మందికి అస్వస్థత

శ్రీకాకుళంలో నాటుసారా తాగి 20మందికి అస్వస్థత
X

నాటుసారా తాగి 20మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం.. సిరిమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైనవారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సిరిమామిడి గ్రామంలో ఒక వ్యక్తి చనిపోవడంతో అతని దహన సంస్కారాలకోసం వచ్చినవారు కొందరు నాటుసారా తాగారు. వీరిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో హరిపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం ధరలు పెరుగడంతో కూలీపనులు చేసుకునేవారు నాటుసారాకు అలవాటుపడ్డారు. దీనిలో భాగంగా వారు నాటుసారా తాగి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.


Tags

Next Story