2022 Holidays List: సెలవులన్నీ పాయే.. పండగలన్నీ ఆదివారమే..

AP Government Holidays List 2022: ఏడాదికి ఎన్ని సెలవులుంటాయో.. కొత్త క్యాలెండర్ రాగానే ఉద్యోగస్తులు మొదట చూసేది ఇవే. మరి వారి ఆశని నిరాశ చేస్తూ వచ్చే ఏడాది వరుసగా పండుగలన్నీ ఆదివారం రావడంతో నీరుగారిపోతున్నారు ఉద్యోగులు. రాబోయే ఏడాదికిగాను ఉద్యోగులకు సాధారణ, ఐచ్చిక, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, ఈద్ మిలాద్‌నబీ, క్రిస్‌మస్ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్ధశి, యాజ్-దహుం-షరీఫ్ వంటి ఐచ్ఛిక సెలవులు ఆదివారం రావడం ఉద్యోగులను నిరాశపరుస్తోంది.
చంద్ర దర్శనాన్ని అనుసరించి సెలవు ప్రకటించే రంజాన్, బక్రీద్, మొహరం, వంటి పర్వదినాలు, తిధులను బట్టి హిందూ పండుగల్లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com