AP corona cases : ఏపీలో కొత్తగా 2,252 కరోనా పాజిటివ్ కేసులు.. 15మంది మృతి

X
AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2వేల 252 పాజిటివ్ కేసులు వచ్చాయి. కోవిడ్ వల్ల ఒక్కరోజులోనే 15మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 2వేల 440 మంది కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 84వేల 858 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 2వేలకుపైగా కేసులు వచ్చాయి. గతంలో కంటే కాస్త కేసులు పెరిగాయి. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నలుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కడప, నెల్లూరు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
