యువతితో మాట్లాడుతుండగా 24 ఏళ్ల యువకుడు దారుణ హత్య

ఒంగోలులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక గాంధి పార్క్ ఎదురుగా నిలబడి ఉన్న యువకుడిని స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి అత్యంత దారుణంగా పొడిచి పరారయ్యాడు. హతుడు ఒంగోలులోని ప్రకాశం కాలనీలో నివసించే 25 ఏళ్ల పసుమర్తి థామస్‌గా గుర్తించారు. ఇతను మంగమూరు రోడ్డులోని శిరికళ వస్త్ర దుకాణంలో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాడు.
ఉదయం ఫోన్ వస్తే గాందీపార్క్ వద్దకు వచ్చాడు..థామస్.. అక్కడ ..తాను పని చేసే వస్త్ర దుకాణంలో పనిచేస్తోన్న ఓ యువతితో మాట్లాడుతుండగా స్కూటీపై వచ్చిన ఆమె భర్త జోసఫ్.. థామస్‌ను కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. అనంతరం..జోసఫ్ తన భార్యను తీసుకుని స్కూటీపై పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో థామస్ స్పాట్‌లోనే చనిపోయాడు. తన కొడుకును అన్యాయంగా చంపాడని హతుడు థామస్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com