ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు..!

X
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. నిన్న 2,498 కరోనా కేసులు నమోదు కాగా, ఇవాళ2,527 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో మరో 19మంది మృతి చెందారు. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,46,749 కి చేరుకుంది. ఇక రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 13,197మంది మృతి చెందారు. అటు కరోనా నుంచి కొత్తగా 2,412మంది కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,38,636 కరోనా టెస్టులు నిర్వహించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
