Vizag: మత్స్యకారులకు వేదన మిగిల్చిన అగ్ని ప్రమాదం

Vizag: మత్స్యకారులకు వేదన మిగిల్చిన అగ్ని ప్రమాదం
36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దగ్ధమైనట్లు గుర్తించిన అధికారులు... ఆదుకోవాలని మత్స్యకారుల వినతి..

విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకారులకు వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందన్న మత్స్యకారులు తమ ఉపాధి ప్రశ్నార్థకమైందని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అటు బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని తొలుత అందులో మంటలు చెలరేగి.. కొద్దిక్షణాల్లోనే పక్క బోట్లకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.


విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీరని నష్టం మిగిల్చింది. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి 11 గంటలపుడు ఒక బోటుతో మొదలైన మంటలు నిలిపి ఉంచిన బోట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోర్ట్ ఫైర్ ఇంజన్లు నాలుగైదు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశాయి. జీరో జెట్టిలో లంగర్ వేసి ఉన్న బోటులో కొందరు యువకులు ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నారని, అందులోనే మొదట మంటలు చెలరేగాయని విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. అంతకుముందే వేట ముగించుకుని హార్బర్‌లో నిలిపి ఉంచిన బోట్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న చేపలు కాలి పోయినట్టుృ మత్స్యకారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న బోట్లలో సిలిండర్లు పేలాయని. ఈ కారణంగా మిగిలిన బోట్లను కాపాడే పరిస్థితి లేదని మత్స్యకారులు తెలిపారు.


ఈ ప్రమాదంతో జీవనోపాధి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ మత్స్యకారులు హార్బర్‌ ప్రవేశద్వారంవద్ద... ఆందోళన నిర్వహించారు. అటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఘటన స్థలానికి వెళ్లి మత్స్యకారులను ఓదార్చారు. ప్రభుత్వం అదుకోకపోతే.. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని మత్స్యకారులుఆవేదన వ్యక్తంచేశారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. ఒక బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని, అందులో చెలరేగిన మంటలు అన్నింటికీ వ్యాపించాయని పోలీసులు తేల్చారు. దగ్ధమైన బోట్ల విలువలో 80శాతం మేర పరిహారంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వరుస ప్రమాదాలు జరుగున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే....... కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. విశాఖ షిప్ యార్డు ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన...... బోట్లు, కోట్లాది రూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని... తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలన్న ఆయన... సమగ్ర విచారణ జరిపించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story