ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు!

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు!
ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు ఈరోజు పెరిగాయననే చెప్పాలి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 402 కరోనా కేసులు బయటపడ్డాయి.

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు ఈరోజు పెరిగాయనే చెప్పాలి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 402 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,79,339కి చేరుకుంది. అటు కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో నలుగురు మృతి చెందారు. ఈ సంఖ్యతో కలిపి మరణాల సంఖ్య 7,082కి చేరుకుంది. ఇక 412 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,68,279కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,978 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 1,13,57,530 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.


Tags

Next Story