56వ రోజు సీకేపల్లి పంచాయతీలో లోకేష్‌ యువగళం

56వ రోజు సీకేపల్లి పంచాయతీలో లోకేష్‌ యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. నేడు 56వ రోజు సీకేపల్లి పంచాయతీ కోన క్రాస్‌ క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభంకానుంది. ఉదయం 9గంటలకు సీకేపల్లిలో వెంకటంపల్లి గ్రామస్తులతో సమావేశం కానున్నారు. 9గంటల 25నిమిషాలకు బీసీ సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. 10గంటల 20నిమిషాలకు యర్రంపల్లిలో జాకీ ఫ్యాక్టరీ బాధితులతో సమావేశమవుతారు. 11గంటలకు నాగసముద్రం క్రాస్‌ వద్ద స్థానికులతో ముచ్చటించనున్నారు. 11గంటల 50నిమిషాలకు నాగసముద్రం గేట్‌ వద్ద ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లతో సమావేశం అవుతారు. 12గంటల 45నిమిషాలకు నాగసముద్రంలో స్థానికులతో భేటీ అవుతారు. విరామం తర్వాత సాయంత్రం 4గంటల 5నిమిషాలకు బసినేపల్లి క్రాస్‌ వద్ద నుంచి పాదయాత్ర పున:ప్రారంభం కానుంది. 4గంటల 35నిమిషాలకు ఉప్పరవాండ్ల కొట్టాలు క్రాస్‌ వద్ద సత్యసాయి వర్కర్లతో భేటీ అవుతారు. 5గంటలకు పైదిండి సమీపంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 6గంటల 20నిమిషాలకు పైదిండి శివార్లలోని విడిది కేంద్రం వరకు పాదయాత్ర సాగనుంది.

Tags

Read MoreRead Less
Next Story