ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కులు.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కులు.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ

కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ఎగువన నాగార్జున సాగర్ నుంచి ఉధృతంగా వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరకట్ట ప్రాంతాలంతా పునరావాస శిబిరాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Tags

Next Story