72గంటల్లో ధాన్యం కొనండి.. లేకపోతే నిరసన తప్పదు : చంద్రబాబు

కొవ్వూరు, నిడదవోలు నియోజక వర్గాలలో చంద్రబాబు మూడో రోజు పర్యటన చేయనున్నారు.12గంటలకు ఎస్.ముప్పవరం గ్రామానికి చేరుకోనున్నారు చంద్రబాబు. తడిచిన ధాన్యంపై వివరాలు సేకరించనున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరామర్శ, అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కంసాలిపాలెం, తీరిగూడెం, సింగవరం ప్రాంతాలలో పర్యటించి రైతులలో మాట్లాడనున్నారు. 72గంటల్లో నష్టపోయిన ప్రతి రైతు దగ్గర ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయకపోతే, ఆందోళన ఉధృతం చేస్తామన్నారు చంద్రబాబు.
చంద్రబాబు . రైతులంతా ముందుకురావాలని..టీడీపీ నాయకత్వ బాధ్యత వహిస్తుందన్నారు. 9న తహసీల్దార్ కార్యాలయాల వద్ద వినతులు ఇస్తారని.. 11న కలెక్టరేట్‌ల వద్ద రైతులకు న్యాయం చేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామన్నారు.. అప్పటికీ పరిష్కారం కాకపోతే 13న పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపడతామని.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట తానే స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు.
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నష్టాలను పూర్తిగా వీడియో తీయాలన్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తగిన పరిహారం అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధాన్యం ఆరబోసేందుకు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తామని, బరకాలు ఇస్తామన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామన్నారు చంద్రబాబు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com