Nellore: జీజీహెచ్‌లో ఘోరం...MICUలో 8 మంది మృత్యువాత

Nellore: జీజీహెచ్‌లో ఘోరం...MICUలో 8 మంది మృత్యువాత
8 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు 8 మంది ఒకేసారి చనిపోలేదన్న డాక్టర్లు ఉదయం నుంచి సాయంత్రం లోపు చనిపోయారన్న డాక్టర్లు

నెల్లూరు జీజీహెచ్‌లో ఘోరం జరిగింది. MICU వార్డులో ఏకంగా 8 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా ఆక్సిజన్‌ అందకపోవడంవల్లే చనిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే 8 మంది ఎలా చనిపోయారన్న విషయం బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మరోవైపు 8 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే డాక్టర్లు మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. 8 మంది ఒకేసారి చనిపోలేదని స్పష్టం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం లోపు చనిపోయినట్లు చెప్తున్నారు. అలాగే ఆక్సిజన్‌ అందలేదన్న ఆరోపణల్ని కూడా డాక్టర్లు తప్పుబట్టారు. లిక్సిడ్‌ ఆక్సిజన్‌ అందకపోవడమంటూ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఒకేరోజు ఇంతమంది చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురి మృతదేహాల్ని ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 8 మంది మృతిపై విచారణ చేపడతామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story