85వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర

85వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర
కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది

కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 85వ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ESV వే బ్రిడ్జి వద్ద విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 నిమిషాలకు అనంతపద్మనాభ స్వామి ఆలయం వద్ద డ్వాక్రా మహిళలతో యువనేత భేటీ కానున్నారు. మధ్నాహ్నం మూడున్నర గంటలకు ఎమ్మిగనూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. ఆ తర్వాత 3.45 నిమిషాలకు ఎన్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లతో లోకేష్ సమావేశం కానున్నారు.

ఇక సాయంత్రం 4 గంటలకు శ్రీనివాస సర్కిల్‌లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు నారా లోకేష్. అనంతరం 4 గంటల 10 నిమిషాలకు ఉప్పరవీధిలో ఉప్పర సామాజికవర్గీయులతో సమావేశం అవుతారు. 4.20 నిమిషాలకు వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి బోయలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత నాలుగున్నర గంటలకు సోమప్ప సర్కిల్ వద్ద ముస్లింలతో యువనేత సమావేశం కానున్నారు. 4.40 నిమిషాలకు ఎస్బీఐ సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాల ప్రతినిధులతో, 4.50 నిమిషాలకు మోర్ షాపింగ్ మాల్ వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. 5 గంటల 5 నిమిషాలకు ఎమ్మిగనూరు పార్కు వద్ద చేనేతలతో సమావేశం నిర్వహించనున్న లోకేష్.. 5.15 నిమిషాలకు ఎమ్మిగనూరు సొసైటీ వద్ద జరిగే యువగళం బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 6.45 నిమిషాలకు ఎమ్మిగనూరు శివసర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ జరపనున్న లోకేష్.. రాత్రి 7.50 నిమిషాలకు ఎమ్మిగనూరు శివారు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story