అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన మూడంతస్తుల భవనం

Anantapur : అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలుకు కదిరిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నారు. అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కరీముల్లా, అతని భార్యను క్షేమంగా బయటకు తీసిన అధికారులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. కరీముల్లా దంపతుల ఇద్దరి పిల్లలతో పాటు మరో మూడు కుటుంబాల వారు ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు.
మూడు అంతస్తల పాత భవనం పక్కనున్న రెండు అంతస్తుల భవనం మరో ఇంటిపై కుప్పకూలింది. దీంతో రెండస్తుల భవనంతో పాటు మరో ఇల్లు కూలిపోయింది. సమాచారం తెలుసుకుని హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీసు, మున్సిపల్ కమిషనర్, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ నాగేంద్ర సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాత భవనం గోడలు కూలి ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు అంటున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే ప్రాణనష్టం అంచనా వేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com