Tirumala : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో విషాద ఘటన

Tirumala : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో విషాద ఘటన
Tirumala : మానవులకు మాత్రమే కాదు... ఏ జీవైనా తల్లి ప్రేమకు సాటి.. మరొకటి లేదని నిరూపణ అయ్యింది.

Tirumala : మానవులకు మాత్రమే కాదు... ఏ జీవైనా తల్లి ప్రేమకు సాటి.. మరొకటి లేదని నిరూపణ అయ్యింది. తిరుమల మొదటి ఘాట్‌లో జరిగిన విషాద ఘటనే ఇందుకు నిదర్శనం. 7వ మైలు రాయి దగ్గర రోడ్డు దాటుతుండగా నెలలు నిండి గర్భంతో ఉన్న జింకను బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలన ఆ జింక.... విలవిల్లాడుతూ తన పిల్లకు జన్మనిచ్చిన తర్వాత కన్నుమూసింది. ఈ ఘటన అక్కడివారందరి కళ్లు చెమ్మగిల్లే చేసింది. తీవ్ర రక్త స్రవంతో పిల్లకు జన్మనివ్వడం అక్కడివారందరినీ కంట తడిపెట్టింది. విజిలెన్స్‌ అధికారుల సమాచారం అందుకున్న టీటీడీ అటవీ అధికారులు... జింక మృతదేహాన్ని, అప్పుడే పుట్టిన జింక పిల్లను అక్కడి నుంచి తరలించారు.

Tags

Next Story