srisailam: శ్రీశైలంలో డ్రోన్ కలకలం.. కెమెరా బృందానికి సహకరించిందెవరు? అనే కోణంలో దర్యాప్తు..

X
srisailam (tv5news.in)
srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీశైలంలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపాయి. ఆలయం సమీపంలో ఉన్న పుష్కరిణి వద్ద డ్రోన్ కెమెరాలను గుర్తించారు భక్తులు. ఇంత జరుగుతున్నా సెక్యూరిటీ సిబ్బంది గానీ, ఆలయ అధికారులు గానీ వాటిని గుర్తించలేదు. చివరికి భక్తులు చెప్తే గాని స్పందించలేదు. భక్తులు ఇచ్చిన సమాచారాంతో పుష్కరిణి వద్ద చేరుకున్న అధికారులు.. కెమెరా బృందాన్ని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా ఆలయంలోకి డ్రోన్ ఎలా వచ్చింది..? వారికి సహకరించిన వారు ఎవరు..? అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
