జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం.. రూ.30 లక్షలకు విక్రయం..!

జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం.. రూ.30 లక్షలకు విక్రయం..!
కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నాగరాజు అనే రైతుకు జాక్‌పాట్ తగిలింది. పొలంలో లక్షలు విలువచేసే వజ్రం లభించింది.

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నాగరాజు అనే రైతుకు జాక్‌పాట్ తగిలింది. పొలంలో లక్షలు విలువచేసే వజ్రం లభించింది. స్థానిక వ్యాపారి ఆ వజ్రాన్ని 30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ అరుదైన వజ్రాన్ని కొనుగోలు చేయడానికి స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారులు పోటీ పడ్డారు. అయితే కోట్లాడి రూపాయలు విలువ చేసే వజ్రాన్ని ఆ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరి, తుగ్గలి తదితర ప్రాంతాల్లో తరచుగా వజ్రాలు లభ్యమౌతున్నాయి. వజ్రాల కోసం స్థానికులతో పాటు కర్ణాటక, అనంతపురం జిల్లాల నుండి కూడ వచ్చి వెతుకుతారు. మరోవైపు వజ్రాల వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే వజ్రాల వేలం పాటలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

Tags

Next Story