బుర్రిపాలెంలో దారుణ హత్య!

బుర్రిపాలెంలో దారుణ హత్య!
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో దారుణ హత్య చోటు చేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన కృష్ణమూర్తి అనే వ్యక్తికి దారుణంగా హత్య చేశారు.

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో దారుణ హత్య చోటు చేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన కృష్ణమూర్తి అనే వ్యక్తికి దారుణంగా హత్య చేశారు. అక్కడికక్కడే కృష్ణమూర్తి మృతి చెందాడు. అన్నదమ్ముల మధ్య పొలం వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అన్న కొడుకు మురళీ, కృష్ణమూర్తికి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా మృతుడు కృష్ణమూర్తికి, అతని అన్నకు మధ్య 30 సెంట్ల పొలం వివాదం ఉన్నట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Tags

Next Story