నిజాయితీ అంటే ఇదే.. రూ. 18 లక్షలు ఉన్న ఏటీఎం కార్డును..

నిజాయితీ అంటే ఇదే..  రూ. 18 లక్షలు ఉన్న ఏటీఎం కార్డును..
ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌తో సహా పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? అందులో ఏకంగా 18 లక్షల రూపాయలు ఉంటే? ఏవరికైనా ఆ కార్డు దొరికితే క్షణాల్లో మన డబ్బు మాయం అయిపోతుంది.

ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌తో సహా పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? అందులో ఏకంగా 18 లక్షల రూపాయలు ఉంటే? ఏవరికైనా ఆ కార్డు దొరికితే క్షణాల్లో మన డబ్బు మాయం అయిపోతుంది. కానీ ఇలా జరగలేదు. తనకు దొరికిన ఏటిఎం కార్డును సేఫ్‌గా పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన విశాఖ జిల్లా కంచరపాలెంలో జరిగింది.

ఉదయ్‌ ఆనంద్‌ అనే వ్యక్తికి చెందిన ఏటీఎం కార్డు ప్రీతమ్‌ కుమార్‌ అనే యువకుడికి దొరింది. ఆ కార్డుపై పిన్‌ నెంబర్‌ కూడా ఉంది. అది పనిచేస్తుందో లేదో తెలుసుందామని చూస్తే ఆ అకౌంట్‌లో ఏకంగా 18 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించాడు ప్రీతమ్‌ కుమార్‌.

దీంతో ఆ కార్డును ఉదయ ఆనంద్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రీతమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఆ కార్డును వారికి అప్పగించాడు. దీంతో ఉదయ్‌ ఆనంద్‌ అడ్రస్‌కు తెలుసుకున్న పోలీసులు అతనిడికి ఏటీఎం కార్డు ఇచ్చారు. నిజాయితీగా కార్డును అప్పగించిన ప్రీతమ్‌ను పోలీసులు అభినందించారు.

Tags

Next Story