Vijayawada: కుమార్తె కళ్లెదుటే తండ్రిని చంపేసిన ప్రేమోన్మాది

విజయవాడ నగరంలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. దర్శినితో నాలుగేళ్లుగా మణికంఠకు పరిచయం ఏర్పాడింది. ఇద్దరి మధ్య ప్రేమ కొన్నాళ్ళ క్రితం వరకు ప్రేమ వ్యవహారం నడిచినట్టు పోలీసులు గుర్తించారు. మణికంఠ తీరు నచ్చక కొన్నాళ్లుగా దర్శిని దూరం పెట్టినట్లు సమాచారం. దర్శిని దూరం పెట్టినా వెంటపడి వేధిస్తున్నాడని తండ్రి శ్రీరామ్ ప్రసాద్ కు చెప్పటంతో వివాదం స్టార్ట్ అయింది. మణికంఠ ఇంటికి పెద్ద మనుషులతో వెళ్లి తన కుమార్తె జోలికి రావద్దని దర్శిని తండ్రి శ్రీరామ్ ప్రసాద్ చెప్పారు.
అయితే, నిన్న ( గురువారం ) రాత్రి తన ఇంటి దగ్గర వెదురు కర్రలు కరికే వారి దగ్గర కత్తి పని ఉందని తీసుకుని దర్శిని తండ్రి షాప్ దగ్గరకు వచ్చిన మణికంఠ.. శ్రీరామ్ ప్రసాద్ బైకును తన బైకుతో ఢీ కొట్టి.. అతడ్ని మణికంఠ ఆరుసార్లు కత్తితో పొడిచాడు. తన తండ్రిని చంపొద్దు అని యువతి దర్శి వేడుకుంటున్నా.. కూడా మణికంఠ ఏ మాత్రం కనికరించకుండా శ్రీరామ్ ప్రసాద్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఇక, మణికంఠపై పోలీసులకు దర్శిని ఫిర్యాదు చేసింది. హత్యా అనంతరం భవానీ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు మణికంఠ లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com