Srisailam: శ్రీశైలం పులిహోర ప్రసాదంలో మాంసం ముక్క

Srisailam: శ్రీశైలం పులిహోర ప్రసాదంలో మాంసం ముక్క
అధికారులపై మండిపడుతున్న భక్తులు

మెత్తగా ఉండాల్సిన శ్రీశైలం పులిహోరలో శుక్రవారం భక్తులకు అందించిన ప్రసాదంలో కోడి ఎముక కలకలం రేపింది. మల్లన్న దర్శనానంతరం.. భక్తులకు నిత్యప్రసాద వితరణలో అందించిన పులిహోరను..తినడానికి ప్రయత్నించగా.. గట్టిగా తగిలిందని... పరిశీలిస్తే ఎముక బయటపడిందని..బాధిత భక్తుడు తెలిపాడు. విషయాన్ని ఆలయ ఏఈఓకు ఫిర్యాదు చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో జరిగిన దుర్ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలోకి ఎముక ఎలా వచ్చిందని దేవస్థానం నిర్వాహకులను భక్తులు నిలదీశారు.

తెలుగు రాష్ట్రాలలో కొలువైన ప్రముఖ శైవక్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. నిత్యం వేలమంది భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పర్వదినాలు, మాఘమాసం, కార్తీకమాసాల్లో శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో శ్రీశైలానికి చేరుకుని మల్లన్న సేవలో పాల్గొంటూ ఉంటారు. అంత శుచీ శుభ్రతతో గుడికి వచ్చే భక్తులు.. ఆలయ అధికారులు, సిబ్బంది నుంచి కూడా అలాగే కోరుకుంటారు. కానీ శ్రీశైలంలో ఊహించని ఘటన జరిగింది. స్వామివారి సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది. ఈ విషయం ఇప్పుడు బయటకు పొక్కడంతో భక్తులు మండిపడుతున్నారు. మల్లన్న సన్నిధిలో ఇదేం ఘోరమంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే తీర్థమేదైనా, క్షేత్రమేదైనా ఆలయంలో ఇచ్చే ప్రసాదాలకు అంతులేని విలువ ఉంటుంది. చాలామంది భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తారు. అందుకే కళ్లకు అద్దుకుని, మనసులో దేవుణ్ని స్మరించుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. కానీ శ్రీశైలంలో మాత్రం ఆ విషయంలో అపచారం జరిగింది. ఓ భక్తుడికి ప్రసాదంలో మాంసం ముక్క వచ్చింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక ఉన్న బ్రహ్మానందరాయ గోపురం వద్ద పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో హరీష్ రెడ్డి అనే భక్తుడికి మాంసం ముక్క వచ్చింది.

ప్రసాదంలో మాంసం ముక్క రావటంతో హరీశ్ రెడ్డి కంగుతిన్నారు. వెంటనే ఈ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎముక ముక్కతో సహా ఆధారాలతో లిఖితపూర్వకంగా ఆలయ అధికారులకు ఫిర్యాదుచేశారు. స్వామివారి సన్నిధిలో ప్రసాదంలో ఇలాంటి అపచారాలు ఏమింటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విషయం కాస్తా బయటకు వచ్చింది. పులిహార ప్రసాదంలో ఎముక ముక్క రావటంపై భక్తులు మండిపడుతున్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దంటూ మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story