విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆధార్‌ అక్రమాలు

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆధార్‌ అక్రమాలు

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆధార్‌ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. బీఎస్‌ఎన్ఎల్‌, ఆంధ్రాబ్యాంకులలో ఉన్న ఆధార్‌ కేంద్రాలలో మధ్యవర్తులు డబ్బులు తీసుకుని వయస్సు మారుస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జిల్లాకలెక్టర్‌, ఎస్పీలు విచారణకు ఆదేశించారు. చీపురుపల్లి రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌.... పోలీసులకు లిఖతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన బొబ్బిలి డీఎస్పీ పాపారావు విచారణ చేస్తున్నారు. సంక్షేమపథకాలకు అనర్హులైనవారు... బ్రోకర్ల ద్వారా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి వయస్సు మార్చుకుంటున్నట్లు గుర్తించారు డీఎస్పీ.

ఇందుకోసం రాజాంకు చెందిన రాధాకృష్ణ, జితేంద్ర, బూర్జాకి చెందిన సంజీవ్‌, వంగరికి చెందిన శ్రీనివాస్‌లను మధ్యవర్తులుగా పెట్టుకున్నట్లు తేల్చారు. వీరు అప్పటికప్పుడు నకిలీ ధృవపత్రాలు తయారు చేసి....బీఎస్‌ఎన్‌ఎల్‌, ఆంధ్రా బ్యాంక్‌ ఆధార్‌ కేంద్రాల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దాదాపు 6 వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా ఆధార్‌ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. వీరిని అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు డీఎస్పీ పాపారావు. ఈ కేసులో మరికొందరిని అదుపులో తీసుకుంటామన్నారు.

Next Story