నేటి నుంచి రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తి కావడంతో.. నేటి నుంచి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది.

మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తి కావడంతో.. నేటి నుంచి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు.. 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

3,335 పంచాయతీలు, 33, 632 వార్డుల్లో రెండో దఫాలో ఎన్నికలకు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు చేయవచ్చు.

ఇక ఫిబ్రవరి 5న అధికారులు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన చేయనున్నారు. ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనుండగా.. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు.

ఫిబ్రవరి 13న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం అదే రోజు ఉప సర్పంచి ఎన్నిక కూడా చేపట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story