వంతెనపై రెండు బైక్‌లు ఢీ. ఎగిరి నదిలో పడ్డ 9 ఏళ్ల చిన్నారి

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నది వంతెనపై శనివారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నదిలో పడి 9 ఏళ్ల చిన్నారి గల్లంతైంది. ఇద్దరికి తీవ్ర గాయాలై మృతి చెందారు. ఆ చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సైదాపురం మండలానికి చెందిన మురళి, సుజాతలు నదీ తీరాన ఉన్న వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లివస్తున్నారు. ఈ సమయంలో గ్రీన్‌టెక్ పరిశ్రమకు చెందిన కార్మికులు త్రినాధ్, సాయిలు బైక్‌పై వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న 9 ఏళ్ల చిన్నారి ప్రవళిక ఎగిరి నదిలో పడి గల్లంతైంది. తీవ్ర గాయాలపాలైన త్రినాధ్, సాయిలను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
Next Story