పవన్‌ కల్యాణ్ కటౌట్లు కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి

పవన్‌ కల్యాణ్ కటౌట్లు కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలో విషాదం చోటు చేసుకుంది.. జనసేన అధినేత పవన్..

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలో విషాదం చోటు చేసుకుంది.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కటౌట్లు కడుతుండగా ప్రమాదం జరిగింది.. కరెంటు తీగలు బ్యానర్లపై పడటంతో కరెంట్‌ షాక్‌తో ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.. మరోవైపు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, ఆర్ధిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని ఆయన కోరారు.

Tags

Next Story