ఏపీలో దారుణం.. రామతీర్థం ఆశ్రమంలో అచ్చుతానంద స్వామి హత్య

ఏపీలో దారుణం.. రామతీర్థం ఆశ్రమంలో అచ్చుతానంద స్వామి హత్య
శివాలయంలో 40 సంవత్సరాలుగా స్వామిజీ పూజలు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో దారుణం జరిగింది. చుక్కవారిపల్లి గ్రామంలోని రామతీర్థం ఆశ్రమంలో అచ్చుతానంద స్వామిని దుండగులు హత్య చేయడం కలకలం రేపుతోంది. వేదగిరివారి పల్లి పంచాయతీ అక్కం చెరువుపల్లి శివాలయంలో 40 సంవత్సరాలుగా స్వామిజీ పూజలు చేస్తున్నారు.

మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి స్వామిని ఉరివేసి చంపేశారని, తాను ప్రాణభయంతో మామిడితోపులోకి పారిపోయానని ఆయన సేవకురాలు చెప్తోంది. ఐరాల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story