Prakash Raj : 'కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు'.. ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్

Prakash Raj : ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు నటుడు ప్రకాశ్‌రాజ్. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై వ్యవహరిస్తున్న తీరును దారుణంగా తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలే కానీ పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ.. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్దతి కాదంటూ దుయ్యబట్టారు. సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటీ ? అంటూ నిలదీశారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మలా ? అంటూ ప్రశ్నించారు. ఏవైనా ఉంటే.. రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలని.. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకన్నారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా.. ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive 🙏🏻🙏🏻🙏🏻#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com