Adani: అదానీపై ఎపీ సర్కార్ ప్రేమ

X
By - Subba Reddy |9 Feb 2023 11:15 AM IST
కేబినెట్ భేటీలో అదానీకి చెందిన కంపెనీలకు భారీగా భూ సంతర్పణ
అదానీ వ్యవహారంపై అటు దేశం, ఇటు పార్లమెంటు అట్టుడికిపోతున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మూలంగా అదానీ పెట్టుబడులు కుదేలవుతున్నాయి. ఎన్ని కాయకల్ప చికిత్సలు చేస్తున్నా ఈ కంపెనీ షేర్ల పతనం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. అయినా అదానీ గ్రూప్ కంపెనీలపై వైసీపీ సర్కారు అంతులేని ప్రేమ కించిత్తు కూడా తగ్గలేదు. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఆ సంస్థకు చెందిన కంపెనీలకు భారీగా భూ సంతర్పణ చేసింది. వందల ఎకరాల భూములను కేబినెట్ సమావేశంలో పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు, డేటా సెంటర్‌ల కోసం కేటాయించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com