Adani: అదానీ కుంభకోణంపై సమగ్రవిచారణ చేపట్టాలి

Adani: అదానీ కుంభకోణంపై సమగ్రవిచారణ చేపట్టాలి
X
అదానీ స్కాంకు వ్యతిరేకంగా ఇవాల్టి నుంచి 12వరకు ఆందోళన

అదానీ కుంభకోణంపై సమగ్రవిచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. అదానీ అక్రమ లావాదేవీలపై జేపీసీ వేయాలన్నారాయన. అదానీ స్కాంకు వ్యతిరేకంగా ఇవాల్టి నుంచి 12వరకు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. SBI, LIC ఆఫీస్‌ వద్ద నిరసన చేపడుతున్నామని, 13వ తేదీ ఛలోరాజభవన్‌ పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. జగన్‌ పాలన అస్తవ్య్తంగా ఉందన్న ఆయన జీవో వన్‌ అనాలోచిత నిర్ణయమన్నారు. దీనిపై ఇప్పటికే కోర్టుకు వెళ్లామని, తీర్పు రిజర్వ్‌లో ఉందని గుర్తు చేశారు. వివేకా హత్య కేసులోనూ న్యాయం జరగాలన్నారు. కాంగ్రెస్‌ ఆఫీసులకు సైతం నోటీసులిచ్చారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు.

Tags

Next Story