ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్

ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపధ్యంలో కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ ను ప్రభుత్వం నియమించింది.

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపధ్యంలో కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ ను ప్రభుత్వం నియమించింది. అయన ఈ నెల 31 న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదిత్యనాథ్ దాస్ స్వరాష్ట్రం బీహార్‌ కాగా, అయన తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి.. 1987వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఈ ఆదిత్యనాథ్ దాస్. అటు సాహ్నిని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పురపాలకశాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను ఏపీ ప్రభుత్వం నియమించింది.

Tags

Read MoreRead Less
Next Story