7 Jan 2021 10:17 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అఖిలప్రియ తమతో ఎప్పుడూ...

అఖిలప్రియ తమతో ఎప్పుడూ సంప్రదించలేదు : లాయర్‌ ప్రతాప్‌రావు

భూ లావాదేవీలు భూమా నాగిరెడ్డి తరపున ఏవీ సుబ్బారెడ్డి చూసుకునేవారని, అందుకే ఆయనతో తమకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.

అఖిలప్రియ తమతో ఎప్పుడూ  సంప్రదించలేదు :  లాయర్‌ ప్రతాప్‌రావు
X

మాజీ మంత్రి అఖిలప్రియ తమతో నేరుగా ఎప్పుడు సంప్రదించలేదన్నారు అడ్వకేట్‌ ప్రతాప్‌ రావు. తమ తండ్రి, అఖిలప్రియ నాన్న ఉన్నప్పుడు మా కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవన్నారు. భూ లావాదేవీలు భూమా నాగిరెడ్డి తరపున ఏవీ సుబ్బారెడ్డి చూసుకునేవారని, అందుకే ఆయనతో తమకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. భూమా ఆర్థిక లావాదేవీలు సైతం ఏవీ సుబ్బారెడ్డి చూసుకునేవారని, అందుకే ఆయనతో సంప్రదింపులు జరిపి ల్యాండ్‌ డీల్‌ చేసుకున్నట్లు తెలిపారు. అఖిల ప్రియ వద్ద డాక్యుమెంట్లు ఉంటే లీగల్‌గా వెళ్లవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

Next Story