మందడం చేరుకున్న హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌, ముస్లింలీగ్‌ పార్టీ నేతలు

మందడం చేరుకున్న హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌, ముస్లింలీగ్‌ పార్టీ నేతలు

ఏపీ రాజధానిగా అమరావతి కాకుండా ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా..రాజధాని ఎలా పెడుతుందో చూస్తామన్నారు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌. ఛలో అమరావతి యాత్ర చేపట్టిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు మందడం రైతులు. గ్రామ సరిహద్దు నుంచి పాదయాత్రగా రైతు దీక్షా శిభిరానికి తరలివచ్చారు శ్రవణ్‌కుమార్, ముస్లింలీగ్‌ పార్టీ నేతలు. అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు శ్రవణ్‌కుమార్‌. రాజధాని విషయంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామన్నారు. అమరావతి దళిత రైతులకు అండగా ఉంటామన్నారు. అమరావతి తరలింపును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేసారు శ్రవణ్‌ కుమార్.

దళితులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమన్నారు శ్రవణ్‌కుమార్‌. దేశ చరిత్రలో దళితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీ సర్కార్ అన్నారు. దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు రాజధాని కోసం భూములు ఇచ్చి.. ఆ భూములను కాపాడుకోడానికి 315 రోజులుగా దీక్షలు చేస్తున్నారన్నారు. అసలు ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నారన్నదానిపై ప్రభుత్వం స్పందించకుండా వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. దళిత రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారికి అండగా పాదయాత్ర చేపట్టామని శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story