పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారు : శ్రవణ్ కుమార్ ఆవేదన

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు- దళిత జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఆందోళనలనకు అనుమతి లేదంటూ జేఏసీ నేతలు, మహిళలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే వారు కూడా ప్రతిఘటించడంతో పోలీసులు బలవంతగా మహిళలను వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది..
ఏపీలో దళిత రైతులపైనే ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటి కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి వద్ద అంబేద్కర్ విగ్రమానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు మద్దతుగా భారీగా దళితులు, మహిళలు అక్కడకు చేరుకున్నారు.. అంతా కలిసి అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర చేపట్టారు. అయితే ర్యాలీకు అనుమతి లేదంటూ దళిత సంఘాల నాయకులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు న్యాయవాది శ్రావణ్... పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారాని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దిళుతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.. రానున్న రోజుల్లో జగన్ సర్కార్ కు దళితులు, మైనార్టీలు, బీసీలు రాజకీయ సమాధి కడతారని ఆయన హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com