Ahobilam: మఠం కేసు.. ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ

అహోబిలం మఠం కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మఠం సాధారణ కార్యకలాపాల్లో ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారని ప్రశ్నించించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అవసరం లేదని స్పష్టంచేసింది. గతంలో అహోబిలం మఠంలో ఈవో నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com