AI: కృత్రిమ మేధతో దోమలపై దండయాత్ర

AI: కృత్రిమ మేధతో దోమలపై దండయాత్ర
X
ఏఐ సాయంతో దోమల నియంత్రణ.. దేశంలోనే తొలిసారి ఏపీలోనే అమలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో దో­మ­ల­పై దం­డ­యా­త్ర­ను కూ­ట­మి ప్ర­భు­త్వం ము­మ్మ­రం చే­సిం­ది. ప్రా­ణాం­తక వ్యా­ధు­ల­కు కా­ర­ణ­మైన దోమల అం­తా­ని­కి పక్కా ప్ర­ణా­ళి­క­ను అమలు చే­స్తోం­ది. నూతన టె­క్నా­ల­జీ­తో దో­మ­ల­పై యు­ద్ధా­న్ని ప్ర­క­టిం­చ­బో­తుం­ది. వర్షా­కా­లం­లో వచ్చే సీ­జ­న­ల్ వ్యా­ధుల కాలం కూడా వచ్చే­సి­న­ట్లే. ఈ సీ­జ­న్‌­లో దోమల వల్లే రో­గా­లు వస్తా­యి అన­డం­లో ఎలాం­టి సం­దే­హం లేదు. 2014లో దో­మ­ల­పై దం­డ­యా­త్ర వంటి కా­ర్య­క్ర­మం చే­ప­ట్టిన సీఎం చం­ద్ర­బా­బు... ప్ర­స్తు­తం దో­మ­ల­పై దం­డ­యా­త్ర­కు ఏఐను వి­ని­యో­గిం­చు­కో­వా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. ఏఐలో అత్య­ధి­కం­గా దో­మ­లు ఉండే ప్రాం­తా­ల­ను గు­ర్తిం­చ­డం సహా ఆయా ప్రాం­తా­ల్లో దోమల వ్యా­ప్తి, ని­వా­రణ కోసం ఏఐతో పని­చే­సే సరి­కొ­త్త వ్య­వ­స్థ­ను తీ­సు­కు­రా­నుం­ది. ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ ఆధా­రం­గా పని­చే­సే స్మా­ర్ట్ మస్కి­టో సర్వె­లె­న్స్ సి­స్ట­మ్ (SMoSS)ను త్వ­ర­లో అమ­ల్లో­కి తీ­సు­కు­రా­ను­న్న­ట్లు ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ది. ఏఐ, క్వాం­టం కం­ప్యూ­టిం­గ్ వంటి అత్యా­ధు­నిక స్మా­ర్ట్ వ్య­వ­స్థ­ల­ను ఏపీ­లో ప్ర­వే­శ­పె­ట్టా­ల­ని భా­వి­స్తు­న్న చం­ద్ర­బా­బు తా­జా­గా దోమల ని­ర్మూ­ల­న­కు ఏఐను వి­ని­యో­గిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. ఇం­దు­లో భా­గం­గా కొ­త్త­గా ఏఐ ఆధా­రి­తం­గా పని­చే­సే స్మా­ర్ట్ దోమల నిఘా వ్య­వ­స్థ­ను అం­దు­బా­టు­లో­కి తె­స్తోం­ది. ఆరు కా­ర్పో­రే­ష­న్ల­లో ప్ర­యో­గా­త్మ­కం­గా అమలు చే­యా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. సక్సె­స్ అయి­తే మి­గి­లిన ప్రాం­తా­ల­లో అమలు చే­య­నుం­ది .

66 ప్రాంతాల్లో అమలు

ఏపీ­లో­ని 6 ప్ర­ధాన ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ల­లో­ని 66 ప్రాం­తా­ల్లో పై­ల­ట్ ప్రా­తి­ప­ది­కన స్మా­ర్ట్ మస్కి­టో సర్వె­లె­న్స్ సి­స్ట­మ్‌­ను అమలు చే­యా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. గ్రే­ట­ర్ వి­శా­ఖ­లో 16 ప్రాం­తా­ల్లో, కా­కి­నా­డ­లో 4, రా­జ­మ­హేం­ద్ర­వ­రం­లో 5, వి­జ­య­వా­డ­లో 28, నె­ల్లూ­రు­లో 7, కర్నూ­లు­లో 6 ప్రాం­తా­ల్లో పై­ల­ట్ ప్రా­జె­క్టు­గా అమలు చే­య­ను­న్న­ట్లు పు­ర­పా­లక, పట్ట­ణా­భి­వృ­ద్ధి శాఖ ఉన్న­తా­ధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. దో­మ­లు ఎక్కు­వ­గా ఉండే ప్రాం­తా­ల్లో AIతో పని చేసే స్మా­ర్ట్ సె­న్సా­ర్లు ఏర్పా­టు చే­య­ను­న్న­ట్లు తె­లి­పా­రు. ఈ ‘స్మా­ర్ట్ మస్కి­టో సర్వై­లె­న్స్ సి­స్ట­మ్’ ద్వా­రా దోమల సాం­ద్రత ఎక్కు­వై­తే వెం­ట­నే అధి­కా­రు­ల­కు అల­ర్ట్‌­లు వె­ళ్తా­యి. అం­తే­కా­దు డేటా సెం­ట్ర­ల్ సర్వ­ర్‌­కు చే­రు­తుం­ది. అక్క­డి నుం­చి అధి­కా­రు­లు రి­య­ల్ టైమ్ డా­ష్‌­బో­ర్డు ద్వా­రా పర్య­వే­క్షిం­చి దో­మ­లు అం­త­మె­ుం­దిం­చేం­దు­కు చర్య­లు తీ­సు­కుం­టా­రు. అప్పు­డు దో­మ­లు ఎక్కు­వ­గా ఉన్న ప్రాం­తా­ల్లో వే­గం­గా ఫా­గిం­గ్కు వెం­ట­నే చర్య­లు తీ­సు­కో­వ­చ్చ­ని పు­ర­పా­లక శాఖ ము­ఖ్య కా­ర్య­ద­ర్శి సు­రే­ష్ కు­మా­ర్ వె­ల్ల­డిం­చా­రు. అలా­గే డ్రో­న్ల­ను ఉప­యో­గిం­చి లా­ర్వా­సై­డ్ చల్ల­డం వల్ల తక్కువ రసా­య­నాల వి­ని­యో­గం­తో దో­మ­ల­ను ని­వా­రిం­చ­ను­న్న­ట్లు పు­ర­పా­లక శాఖ అధి­కా­రు­లు తె­లి­పా­రు.

Tags

Next Story