Air Balloon Theatre: ఏపీలో ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా !!

Air Balloon Theatre: ఏపీలో ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా !!
X
Air Balloon Theatre: ఇప్పటి వరకు మొబైల్ క్యాంటిన్లు చూశాము.. ఇప్పుడు థియేటర్లు కూడా వచ్చేశాయి.

Air Balloon Theatre: ఇప్పటి వరకు మొబైల్ క్యాంటిన్లు చూశాము.. ఇప్పుడు థియేటర్లు కూడా వచ్చేశాయి. వీటిని ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ఆసిఫాబాద్ లో ఇలాంటి థియేటర్ ఏర్పాటు చేశారు.

పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో టూరింగ్ టాకీసులు ఉండేవి.. వాటిల్లోనే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లు సినిమాలు చూసి ఆనందించే వారు.. ఇప్పుడన్నీ మల్టీ ప్లెక్సులు వచ్చాయి.. అదీ సిటీల్లో సినిమా చూడాలంటే అంత దూరం వెళ్లి అంత ఖర్చు పెట్టి చూసే స్థోమత అందరికీ ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ బెలూన్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అచ్చంగా థియేటర్లో చూసే అనుభూతిని కల్పిస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేందుకు వీలుగా ఉన్న థియేటర్ ను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సిద్ధం చేస్తున్నారు.

ఇక్కడి జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ థియేటర్ ను మన రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 23న థియేటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తొలి మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రంతో ప్రారంభం అవుతుందని థియేటర్ నిర్వహకులు చెబుతున్నారు.

బెలూన్ థియేటర్ ప్రత్యేకతలు..

బెలూన్ వంటి షీట్లలో గాలిని నింపి మొబైల్ థియేటర్ తయారు చేస్తారు. వాతావరణ పరిస్థితులు, అగ్నిప్రమాదాలను తట్టుకునే టెక్నాలజీ వీటి తయారీలో వినియోగిస్తారు. ఒకేసారి 120 మంది కూర్చుని సినిమా చూడొచ్చు. బయటి నుంచి చూసే వారికి ఇది ఓ సెట్టింగ్ లా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం మల్టీ ప్లెక్స్ థియేటర్ కి ఏమాత్రం తీసిపోదు.

Tags

Next Story