అజయ్ అనుమానాస్పద మృతిలో కొత్త కోణం వెలుగులోకి..

అజయ్ అనుమానాస్పద మృతిలో కొత్త కోణం వెలుగులోకి..
డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్.. హైదరాబాద్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు వచ్చినప్పుడు..

SEB అదుపులో ఉన్న అజయ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఘటనపై సబ్‌ కలెక్టర్‌ ధ్యాన చంద్ర వివరాలు సేకరిస్తున్నారు. మొదట మార్చురీ దగ్గరకు వెళ్లిన ఆయన.. ఘటనపై ఆరా తీశారు. మృతుడు అజయ్‌ తల్లి, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు.. అజయ్ అనుమానాస్పద మృతిలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సందీప్ దగ్గర రెండేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్.. హైదరాబాద్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు వచ్చినప్పుడు.. పార్సిల్‌ తీసుకురావలని సందీప్‌ చెప్పినట్టు సమాచారం. పార్శిల్ తీసుకెళ్తున్న క్రమంలో నిడమానూరులో మద్యంతో పట్టుబడ్డ అజయ్‌ను పోలీసులు పట్టుకున్నారు. తరువాత SEB ఆఫీసుకు తరలించగా.. లాకప్‌లో ఉన్నప్పుడే మూర్చ, గుండెనొప్పితో ఇబ్బంది పడుతున్న అజయ్‌ మృతి చెందినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story