ఏపీలో రేపటి మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయడంతో పోలింగ్ కేంద్రాలు రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఎన్నికలను పర్యవేక్షిస్తారని, జోనల్ అధికారులు, పర్యవేక్షణ టీంలకు మెజిస్టీరియల్ అధికారులు ఇచ్చినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు అందరూ సహకరించాలన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 78,71 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వియోగించుకోనున్నారు. ప్రస్తుతానికి 11 మున్సిపల్ కార్పొరేషన్లకే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎస్ఈసి 75 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి.
గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలలో అన్ని వార్డులు ఏకగ్రీవమవడంతో ఆ నాలుగు మున్సిపాలిటీలు మినహాయించి 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 2,215 డివిజన్లు, 7,552 మంది వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com