Bhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి ప్రత్యేక ఆహ్వానం..

Bhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి ప్రత్యేక ఆహ్వానం..
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. 27 మంది అల్లూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. వారందరితో ప్రధాని కాసేపు సమావేశం అవుతారు. సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజు మనవడు శ్రీరామరాజు సహా మరికొందరు ఇప్పటికే భీమవరం చేరుకున్నారు.

తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉంటున్న మిగతావారు రేపటికల్లా వస్తున్నారు. విప్లవ వీరుడిగా తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తాతయ్య సీతారామరాజు జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం తమకు గర్వంగా ఉందన్నారు శ్రీరామరాజు. పార్లమెంట్‌లోనూ అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story