ఆలూరులోని ఓ రోడ్డు దయనీయ కథ

ఆలూరులోని ఓ రోడ్డు దయనీయ కథ
ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద నుంచి ఢనాపురం రోడ్డు పరిస్థితి. 25 కి.మీ దూరం ఉన్న ఈ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. బెంజ్‌కారు మంత్రిగా గుర్తింపు పొందిన గుమ్మనూరు జయరాం.... ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం అంటే ఎలా ఉండాలి? అభివృద్ధి లేక పోయినా పర్లేదు..... కనీస మౌలిక సౌకర్యాలు అన్నా కల్పించాలి! కానీ మంత్రిగారు నియోజకవర్గ సమస్యలు గాలికొదిలేశారు. గెలిచి నాలుగేళ్లైనా ఒక్కటంటే ఒక్క పని చేయలేకపోయారు. కనీసం రోడ్లు బాగు చేయలేకపోయారు. దీంతో బస్సులు తిప్పలేమంటూ ఆర్టీసీ అధికారులు సైతం చేతులెత్తేశారు. దీంతో రోడ్లు బాగు చేసుకునేందుకు ఏకంగా గ్రామస్థులు జేఏసీ గా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

ఇది... ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద నుంచి ఢనాపురం రోడ్డు పరిస్థితి. 25 కి.మీ దూరం ఉన్న ఈ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. బెంజ్‌కారు మంత్రిగా గుర్తింపు పొందిన గుమ్మనూరు జయరాం.... ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రోడ్డును బాగు చేయాలంటూ.. అనేక సార్లు విన్నవించుకున్నా.. మంత్రి పట్టించుకోలేదు.దీంతో నాలుగేళ్లుగా ప్రజలు తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఆర్టీసీ బస్సులు కూడా రావడం లేదు. అధ్వాన్నమైన ఈ రోడ్డులో వస్తే బస్సులు చేడిపోతున్నాయంటున్నారు ఆర్టీసీ అధికారులు. అందుకే ఈ మార్గంలో సర్వీసుల్ని సైతం నిలిపేశారు. ఈ మేరకు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ నిలిపి వేస్తున్నట్లు లేఖ రాశారు. హోళగుంద-ఆదోని మధ్య బస్సులు లేకపోవడంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వందవాగిలి, లింగంపల్లి, గజ్జహళ్లి, హెబ్బటం, నాగనాథన హల్లి, ఎండి హల్లి, పెద్ద గోనెహాల్ గ్రామాలు ఈ మార్గంలో ఉన్నాయి. స్కూళ్లు తెరిచిన ఈ సమయంలో... బస్సులు నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు పట్టించుకోక పోవడంతో..... ఇక ఈ రోడ్లను తామే బాగు చేసుకునేందుకు గ్రామస్థులు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

గతంలో 69 కోట్లతో పనులు చేసేందుకు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరామ్ సోదరులు హడావుడి చేశారు. అప్పటికప్పుడు భూమి పూజ కూడా చేశారు. కంకర నిలువ చేశారు. ఆ తరువాత పనులు ప్రారంభం చేసి నిలిపేశారు. దీంతో ఆదోని నుండి ఢనాపురం మీదుగా హోళగుంద వరకు ఆర్టీసీ బస్సులు నడపలేమని ఆర్టీసీ అధికారులు చేసేది ఏమి లేక చివరకు చేతులెత్తేశారు. ఆదోని-హోలగుంద మధ్య ఇదే ప్రధాన రహదారికూడా.. రోడ్డు బాగా లేదని చివరకు ఆటోలు కూడా ఈ గ్రామాల వైపు కి రావడం లేదు. ఆ రోడ్డులో వెళ్తే బైక్ లు, కార్లు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. ఈ రోడ్లు అద్వాన్నంగా మారడంతో చివరకు హోళగుందతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు జేఏసీ గా ఏర్పాటయ్యారు. అంతకు ముందు మంత్రి గుమ్మనూరు జయరాం ను కలసి సమస్య పరిష్కారం చేయమని అడిగిన ఫలితం లేకుండా పోయింది. ఇంక చేసేది ఏమి లేక జె ఏ సిగా ఏర్పాడి హోలగుంద లో సమావేశమై చర్చించారు. దశల వారీగా ఆందోళనలు చేసి రోడ్డు బాగు చేసుకోవాలని సిద్ధమయ్యారు గ్రామస్థులు.. మంత్రి గుమ్మనూర్ జయరాం సెగ్మెంట్ లో ఒక రోడ్డు కోసం గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా జేఏసి గా ఏర్పాటు కావడం దుమారం రేపుతోంది. మంత్రి ఉన్నా నాలుగేళ్లుగా రోడ్డు వేయలదేంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందించి రోడ్డు బాగుచేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story