AMARAVATHI: అమరావతికి అధికారికంగా రాజ ముద్ర

అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామంచోటు చేసుకుంది. అమరావతి చట్టబద్దత అంశంలో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టిఆమోదింపజేసే అవకాశం ఉంది. అనంతరం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. .ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయానికి ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే కేబినెట్ దృష్టికి సైతం ఈ చట్టబద్దత బిల్లు వెళ్లనుంది. ఆ తర్వాత దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది.గత కొన్నాళ్లుగా అమరావతి రాజధానికి చట్ట బద్ధత కల్పించాలని ఏపీలో డిమాండ్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన చట్టంలో ఏముంది?
పార్ట్-2 కింద 5(1): **నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది.
పార్ట్-2 కింద 5(2): **సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు.
మూడు రాజధానులన్న వైసీపీ ప్రభుత్వం
2019అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది.151 స్థానాల్లో గెలుపొంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అనంతరం ఏపీకి మూడు రాజధానులు ప్రకటించారు. దీంతో అమరావతి రాజధానిపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. అమరావతిని శాసన రాజధానిగా...కర్నూలును యరాజధానిగా...విశాఖపట్నంను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏపీకి అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతులు ఉద్యమించారు. సంవత్సరాల తరబడి నిరసనలు చేపట్టారు. కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అమరావతి టు తిరుపతి వరకు పాదయాత్ర సైతం చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు సైతం చోటు చేసుకున్నాయి. అంతేకాదు అమరావతి రైతుల ఉద్యమంలో ఎంతోమంది అరెస్టులు సైతం అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్‌ను పొందుపరిచారే తప్ప ఏపీకి రాజధాని అమరావతి అని చూపలేదు. ఏపీ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

