అమరావతి ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె

X
అమరావతి పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన రైతు సదాశివరావు గుండెపోటుతో కన్నుమూశారు. రాజధాని నిర్మాణానికి సదాశివరావు 2. 25 ఎకరాల భూమి ఇచ్చారు. వైసీపీ సర్కార్ రాజధాని తరలింపు నిర్ణయాన్ని సదాశివరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గత 280రోజులుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు . రైతుల ఆందోళనను సర్కార్ పట్టించుకోకపోవడంతో.. తీవ్ర మనస్థాపం చెందారు సదాశివరావు.చివరికి గుండెపోటుతో చనిపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
