Amaravathi IAS Arrest: విధులు విస్మరించే... ఊచలు లెక్కపెట్టే..!

X
By - Chitralekha |18 Jan 2023 1:28 PM IST
అమరావతిలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు జైలు శిక్ష; విధులు విస్మరించినందుకు.. జైలుపాలైన ఐఏఎల్ లు
విధులు విస్మరించినందుకు గానూ ఇద్దరు అధికారులు జైలు పాలైన వైనం ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకుంది. సర్వీస్ అంశాల్లో కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని ఇద్దరు అధికారులకు జైలు ఏపీ హైకోర్టు శిక్షి విధించింది.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది.
ఐఏఎస్ హోదాలో ఇద్దరు అధికారులకు జైలు శిక్ష పడటం అరుదుగా జరిగే ప్రక్రియ కావడంతో ఈ వార్త జాతీయ మీడియాను సైతం కుదిపేస్తోంది. తక్షణమే అధికారులను అదుపులోకి తీసుకోవాలని హై కోర్డు ఆదేశించింది. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని తాజా తీర్పు నిరూపిస్తోంది.
AP Highcourt orders arrest of Govt.officials
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com