AMARAVATHI: అమరావతిలో పేదలకు పింఛన్‌ పునరుద్ధరణ

AMARAVATHI: అమరావతిలో పేదలకు పింఛన్‌ పునరుద్ధరణ
X
భూ­మి­లే­ని పే­ద­ల­కు పిం­ఛ­న్ల­ను మళ్లీ ప్రా­రం­భం

రా­జ­ధా­ని ప్రాం­తం­లో­ని భూ­మి­లే­ని పే­ద­ల­కు పిం­ఛ­న్ల­ను మళ్లీ ప్రా­రం­భి­స్తూ ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. గతం­లో వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ హయాం­లో రద్ద­యిన ఈ పిం­ఛ­న్ల­ను తా­జా­గా టి­డి­పి ప్ర­భు­త్వం పు­న­రు­ద్ధ­రిం­చిం­ది. ఈ మే­ర­కు పు­ర­పా­ల­క­శాఖ ము­ఖ్య కా­ర్య­ద­ర్శి సు­రే­శ్ కు­మా­ర్ ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. రా­జ­ధా­ని గ్రా­మా­ల్లో­ని 1,575 కు­టుం­బా­లు పిం­ఛ­న్‌­కు అర్హు­లు­గా గు­ర్తిం­చ­బ­డ్డా­యి. ఈ మే­ర­కు 2015లో ని­ర్వ­హిం­చిన ఇం­టిం­టి సర్వే ఆధా­రం­గా కు­టుం­బా­ల­ను ఎం­పిక చే­శా­రు. జీ­వ­నో­పా­ధి­ని కో­ల్పో­యిన వల­స­దా­రు­ల­కు ఈ పు­న­రు­ద్ధ­రణ ఊర­ట­ని­చ్చిం­ది. ఇటీ­వల జరి­గిన మం­త్రి­మం­డ­లి భే­టీ­లో ఈ అం­శా­ని­కి ఆమో­దం లభిం­చ­గా, అధి­కార ఉత్త­ర్వు­ల­తో ఇక పిం­ఛ­న్ల పం­పి­ణీ ప్రా­రం­భం కా­నుం­ది. ఇక నూతన రా­జ­ధా­ని ని­ర్మాణ పనుల పరం­గా కూడా కీలక పు­రో­గ­తి చో­టు­చే­సు­కుం­ది. గుం­టూ­రు జి­ల్లా నే­ల­పా­డు ప్రాం­తం­లో ని­ర్మా­ణం­లో ఉన్న ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు, అధి­కా­రుల క్వా­ర్ట­ర్ల పను­ల­కు ప్ర­భు­త్వం ని­ధు­లు మం­జూ­రు చే­సిం­ది. మొ­త్తం రూ.524.70 కో­ట్లు వి­డు­దల చే­స్తూ పరి­పా­ల­నా అను­మ­తు­లు ఇచ్చిం­ది. ఇం­దు­లో భా­గం­గా 18 టవ­ర్ల­లో 432 అపా­ర్ట్‌­మెం­ట్‌ యూ­ని­ట్ల ని­ర్మా­ణం జరు­గు­తోం­ది. ఈ ని­ర్ణ­యా­లు రా­జ­ధా­ని అభి­వృ­ద్ధి­లో కొ­త్త ప్రో­త్సా­హా­న్ని­స్తా­య­ని స్థా­ని­కు­లు చె­బు­తు­న్నా­రు. పు­న­రు­ద్ధ­రిం­చిన పిం­ఛ­న్ల­తో పాటు ని­ర్మాణ కా­ర్య­క్ర­మాల పు­నః­ప్రా­రం­భం అధి­కార యం­త్రాం­గం ఎక్కువ కది­లిం­చ­నుం­ద­న్న ఆశా­భా­వం వ్య­క్త­మ­వు­తోం­ది.

Tags

Next Story