AMARAVATHI: మూడేళ్లలో అమరావతి తొలి దశ పూర్తి

AMARAVATHI: మూడేళ్లలో అమరావతి తొలి దశ పూర్తి
X
ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం. 20 వేల ఎకరాల సమీకరణకు అంగీకారం

మూ­డే­ళ్ల­లో అమ­రా­వ­తి కలను సా­కా­రం చే­సు­కు­నే ది­శ­గా కూ­ట­మి ప్ర­భు­త్వం అడు­గు­లు వే­స్తోం­ది. ఇం­దు­లో భా­గం­గా రా­జ­ధా­ని ని­ర్మాణ పను­ల­ను వే­గ­వం­తం చేసే ది­శ­గా చం­ద్ర­బా­బు ప్ర­భు­త్వం మరో కీలక అడు­గు వే­సిం­ది. రా­జ­ధా­ని పరి­ధి­లో అద­నం­గా 20 వేల ఎక­రా­ల­కు పైగా భూ­మి­ని సమీ­క­రిం­చేం­దు­కు రా­జ­ధా­ని ప్రాంత అభి­వృ­ద్ధి ప్రా­ధి­కార సం­స్థ అథా­రి­టీ ఆమో­దం తె­లి­పిం­ది. అమ­రా­వ­తి, తు­ళ్లూ­రు మం­డ­లా­ల్లో­ని ఏడు గ్రా­మా­ల్లో కలి­పి మొ­త్తం 20 వేల 494 ఎక­రాల భూ­మి­ని సమీ­క­రిం­చా­ల­న్న ప్ర­తి­పా­ద­న­కు అథా­రి­టీ పచ్చ­జెం­డా ఊపిం­ది. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన 50వ సీ­ఆ­ర్డీఏ అథా­రి­టీ సమా­వే­శం­లో ఈ మే­ర­కు కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. వై­ఎ­స్‌­ఆ­ర్‌­సీ­పీ ఆధి­ప­త్యం ఉన్న ఒకటి, రెం­డు గ్రా­మా­ల్లో కొంత గం­ద­ర­గో­ళ­ముం­ద­న్న మం­త్రి నా­రా­యణ.. 5, 10 శాతం ఆమో­దం లభిం­చ­క­పో­వ­డం సహ­జ­మే­న­ని తే­ల్చి­చె­ప్పా­రు.

భూ కేటాయింపు ఇలా

సెం­ట్ర­ల్ బ్యూ­రో ఆఫ్ ఇన్వె­స్టి­గే­ష­న్‌­‌­కు 2 ఎక­రా­లు, జూ­లా­జి­క­ల్ సర్వే ఆఫ్ ఇం­డి­యా­కు 2 ఎక­రా­లు, స్టే­ట్ ఫో­రె­న్సి­క్ సై­న్స్ ల్యా­బ్‌-5, ఏపీ కో ఆప­రే­టి­వ్ బ్యాం­కు లి­మి­టె­డ్‌­కు 0.495 ఎక­రా­లు, పు­ల్లెల గో­పీ­చం­ద్ బ్యా­డ్మిం­ట­న్ అకా­డె­మీ­కి 12 ఎక­రా­లు, ఎం­ఎ­స్‌­కే ప్ర­సా­ద్ ఇం­ట­ర్నే­ష­న­ల్ క్రి­కె­ట్ అకా­డె­మీ­కి 12 ఎక­రా­లు కే­టా­యి­స్తూ సీ­ఆ­ర్డీఏ అథా­రి­టీ అమో­దం ఇచ్చిం­ది. అలా­గే ఆదా­య­పు పన్ను శా­ఖ­కు 2 ఎక­రా­లు, ఏపీ గ్రా­మీణ బ్యాం­క్‌­కు 2 ఎక­రా­లు, సెం­ట్ర­ల్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా­కు 0.40 ఎక­రా­లు, ఎస్ఐ­బీ­కి 0.50 ఎక­రా­లు, కి­మ్స్‌­కు 25 ఎక­రా­లు, బ్యూ­రో ఆఫ్ ఇమ్మి­గ్రే­ష­న్‌­కు 0.50 ఎక­రా­లు, బీ­జే­పీ కా­ర్యా­ల­యా­ని­కి 2 ఎక­రా­ల­ను, బా­సి­ల్ వు­డ్స్ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్కూ­ల్‌­కు 4 ఎక­రా­లు కే­టా­యిం­చేం­దు­కు సీ­ఆ­ర్డీఏ అథా­రి­టీ ఆమో­దం తె­లి­పిం­ది.

సబ్‌ కమిటీ నిర్ణయాలకు ఆమోదం

భూ­ముల కే­టా­యిం­పు­ల­పై కే­బి­నె­ట్ సబ్ కమి­టీ తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­ల­కు సీ­ఆ­ర్డీఏ అథా­రి­టీ ఆమో­దం లభిం­చిం­ది. సీ­బీఐ, జూ­లా­జి­క­ల్ సర్వే ఆఫ్ ఇం­డి­యా, పు­ల్లెల గో­పీ­చం­ద్ బ్యా­డ్మిం­ట­న్ అకా­డె­మీ, ఎం­ఎ­స్కే ప్ర­సా­ద్ క్రి­కె­ట్ అకా­డె­మీ, కి­మ్స్ సహా 16 సం­స్థ­ల­కు 65 ఎక­రాల మేర భూ కే­టా­యిం­పు­ల­కు ఆమో­దం ఇచ్చా­రు. రా­జ­ధా­ని­లో­ని ఈ-15 రహ­దా­రి­పై 6 లే­న్ల ఆర్వో­బీ ని­ర్మా­ణా­ని­కీ సీ­ఆ­ర్డీఏ అథా­రి­టీ ఆమో­దం ఇచ్చిం­ది. పొ­ట్టి శ్రీ­రా­ము­లు, అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు స్మా­రక చి­హ్నాల ఏర్పా­టు­కు స్థ­లం కే­టా­యిం­చేం­దు­కూ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చా­రు. రా­జ­ధా­ని అమ­రా­వ­తి­కి పరి­శ్ర­మ­లు రా­వా­లం­టే అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం ఏర్పా­టు చే­యా­ల్సిన అవ­స­రం ఉం­ద­న్నా­రు మం­త్రి నా­రా­యణ. 2 వేల 500 ఎక­రా­ల్లో స్మా­ర్ట్‌ పరి­శ్ర­మ­లు తీ­సు­కు­వ­స్తా­మ­ని చె­ప్పా­రు. రా­జ­ధా­ని ని­ర్మాణ పను­ల­కు ఇసుక కొరత లే­కుం­డా చూ­సేం­దు­కు ప్ర­కా­శం బ్యా­రే­జీ ఎగు­వన డీ­సి­ల్టే­ష­న్ ప్ర­క్రియ ద్వా­రా ఇసు­క­ను తవ్వు­కు­నేం­దు­కు అను­మ­తి ఇచ్చా­రు.

Tags

Next Story