AMARAVATHI: అమరావతి నిర్మాణంలో నేడు మహా ఘట్టం

AMARAVATHI: అమరావతి నిర్మాణంలో నేడు మహా ఘట్టం
X
నేడు 25 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన... భూమి పూజ చేయనున్న నిర్మలా సీతారామన్... సీఆర్డీఏ ప్రాంగణంలో వర్చువల్‌గా శంకుస్థాపన

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని అమ­రా­వ­తి­ని ఆర్థిక, వా­ణి­జ్య కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దేం­దు­కు ప్ర­భు­త్వం వడి­వ­డి­గా అడు­గు­లు వే­స్తోం­ది. నేడు అమ­రా­వ­తి­లో రి­జ­ర్వ్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా సహా 25 ప్రై­వే­టు, ప్ర­భు­త్వ రంగ బ్యాం­కుల కా­ర్యా­ల­యా­లు, సం­స్థ­ల­కు శం­కు­స్థా­పన జర­గ­నుం­ది. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి కేం­ద్ర ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, సీఎం చం­ద్ర­బా­బు, పలు­వు­రు మం­త్రు­లు, అధి­కా­రు­లు హా­జ­ర­వు­తా­రు.ఇవాళ ఉదయం 11.10 గంటల నుం­చి 12.25 మధ్య సీ­ఆ­ర్డీఏ ప్ర­ధాన కా­ర్యా­లయ ప్రాం­గ­ణం­లో ని­ర్మిం­చిన పు­ర­పా­లక శా­ఖ­కు చెం­దిన భవనం వే­ది­క­గా వర్చు­వ­ల్‌ వి­ధా­నం­లో శం­కు­స్థా­ప­న­లు చే­సే­లా ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. లిం­గా­య­పా­లెం, ఉద్దం­డ­రా­యు­ని­పా­లెం, రా­య­పూ­డి, వె­ల­గ­పూ­డి, నే­ల­పా­డు, ఐన­వో­లు పరి­ధి­లో ఆయా సం­స్థ­లు, బ్యాం­కు­లు ఏర్పా­టు కా­ను­న్నా­యి. ఈ కా­ర్య­క్ర­మం గత నె­ల­లో­నే జర­గా­ల్సి ఉన్నా మొం­థా తు­పా­ను కా­ర­ణం­గా వా­యి­దా పడిం­ది. ఈ కా­ర్యా­ల­యా­ల­న్నీ అం­దు­బా­టు­లో­కి వస్తే అమ­రా­వ­తి పె­ద్ద ఆర్థిక కేం­ద్రం­గా మా­రు­తుం­ద­ని, ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­లు గణ­నీ­యం­గా పె­రు­గు­తా­య­ని ప్ర­భు­త్వ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. రి­జ­ర్వ్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా, ఎస్‌­బీఐ, యూ­ని­య­న్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా, ఐడీ­బీఐ, ఎల్‌­ఐ­సీ, న్యూ ఇం­డి­యా అస్యూ­రె­న్స్‌ కం­పె­నీ లి­మి­టె­డ్, ఇన్‌­క­మ్‌ ట్యా­క్స్, కె­న­రా బ్యాం­క్, ఏపీ కో­ప­రే­టి­వ్‌ బ్యాం­క్, బ్యాం­క్‌ ఆఫ్‌ బరో­డా, ఇం­డి­య­న్‌ బ్యాం­క్, నే­ష­న­ల్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ అగ్రి­క­ల్చ­ర్‌ అం­డ్‌ రూ­ర­ల్‌ డె­వ­ల­ప్‌­మెం­ట్, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ గ్రా­మీణ బ్యాం­క్, సెం­ట్ర­ల్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా, బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా, పం­జా­బ్‌ నే­ష­న­ల్‌ బ్యాం­క్, ఓవ­ర్సీ­స్‌ బ్యాం­క్, కో­స్ట­ల్‌ ఏరి­యా బ్యాం­క్, ఐడీ­బీఐ, ఏపీ కో­ప­రే­టి­వ్‌ బ్యాం­కు­లు ఇక్కడ తమ కా­ర్యా­ల­యా­ల­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­యి.

హాజరుకానున్న నిర్మలా సీతారామన్

ఈకా­ర్య­క్ర­మా­ని­కి కేం­ద్ర ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌­తో పాటు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, ఉప­ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్, మం­త్రి నారా లో­కే­ష్‌­తో పాటు పలు­వు­రు రా­ష్ట్ర మం­త్రు­లు హా­జ­ర­వు­తా­ర­ని తె­లు­స్తోం­ది. అమ­రా­వ­తి­ని ఆర్థిక కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దా­ల­నే లక్ష్యం­తో.. ఇప్ప­టి­కే కూ­ట­మి ప్ర­భు­త్వం.. వి­విధ బ్యాం­కు­ల­కు అవ­స­ర­మైన భూ­ము­ల­ను కే­టా­యిం­చిం­ది. శం­కు­స్థా­పన కా­ర్య­క్ర­మం ము­గి­స్తే.. అవి ని­ర్మాణ పను­లు ప్రా­రం­భి­స్తా­యి అం­టు­న్నా­రు. ఈ బ్యాం­కుల భవ­నా­లు ని­ర్మిం­చ­డం కోసం ఇప్ప­టి­కే వీ­టి­కి ఉద్దం­డ­రా­యు­ని­పా­లెం వద్ద స్థ­లా­లు కే­టా­యిం­చా­రు. చాలా బ్యాం­కుల ఆ స్థ­లా­న్ని బాగు చే­సు­కు­ని.. ని­ర్మా­ణం ప్రా­రం­భిం­చేం­దు­కు రెడీ అవు­తు­న్నా­యి. సభా వే­ది­క­పై నుం­చి ఒకే­సా­రి అన్ని బ్యాం­కుల భవ­నా­ల­కు శం­కు­స్థా­పన జరు­గు­తుం­ది. స్టే­ట్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా (SBI) కా­ర్యా­ల­యా­ని­కి ప్ర­త్యేక కా­ర్య­క్ర­మం ఏర్పా­టు చే­శా­రు. అయి­తే ఈ బ్యాం­కుల భవ­నాల ని­ర్మా­ణా­ల­కు 2014-19 మధ్య­లో­నే స్థ­లా­లు కే­టా­యిం­చా­రు. కానీ అప్పు­డ­ది ముం­దు­కు సా­గ­లే­దు. అమ­రా­వ­తి­లో స్టే­ట్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా (SBI)కు 3 ఎక­రాల స్థ­లం కే­టా­యిం­చా­రు. ఎస్బీఐ ఇక్కడ 14 అం­త­స్తు­లు బి­ల్డిం­గ్ ని­ర్మిం­చ­బో­తుం­ది. అలా­నే బ్యాం­క్ ఆఫ్ బరో­డా, యూ­ని­య­న్ బ్యాం­క్, కె­న­రా బ్యాం­క్ , ఇం­డి­య­న్ బ్యాం­క్, ఏపీ స్టే­ట్ కో­ఆ­ప­రే­టి­వ్ బ్యాం­క్, పీ­ఎ­న్‌­బీ, సెం­ట్ర­ల్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా­ల­తో పా­టు­గా బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా­కు చెం­దిన భవ­నాల ని­ర్మా­ణం ఒకే­సా­రి మొ­ద­లు­కా­నుం­ది. ఈ బి­ల్డిం­గు­ల్లో­నే ఆయా బ్యాం­కుల రా­ష్ట్ర ప్ర­ధాన కా­ర్యా­ల­యా­లు ఏర్పా­టు చే­య­బో­తు­న్నా­రు.

Tags

Next Story