AMARAVATHI: పరుగులు పెడుతున్న అమరావతి పనులు

AMARAVATHI: పరుగులు పెడుతున్న అమరావతి పనులు
X
కేంద్ర సహకారంతో ఊపందుకున్న పనులు... మరో రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఓకే రూ 2,787 కోట్లతో నిర్మించే ప్రాజెక్ట్‌లకు ఆమోదం

అమరావతి నిర్మాణంలో కీలక ముందడగు పడింది. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమి అయిన అమరావతిలో... కృష్ణమ్మ తీరాన అమరావతిని అద్భుతంగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసింది. రాజధానికి పునరుజ్జీవం వచ్చినట్లే అని ఆంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో రెండు కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహసముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులను రూ.2,787 కోట్లతో చేపట్టనుంది. వాటిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి రూ.1,458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి రూ.1,329 కోట్లు వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అధికారికంగా వెల్లడించారు.

జోరుగా సాగుతున్న పనులు..

ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని కొనసాగుతూ ఉంటాయి కదా. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రమే ఆవాసం కల్పిస్తోంది. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ ను నిర్మిస్తోంది. అదేసమయంలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మిస్తోంది. కొత్తగా పురుడు పోసుకుంటున్న అమరావతి నిర్మాణం 2014 తర్వాత ఈ రెంటి కోసం స్థలాన్ని తీసుకుని భవన నిర్మాణాలను కూడా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీసీడబ్ల్యూడీ) మొదలుపెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణంతో పాటుగా ఈ నిర్మాణాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే ఐధేళ్లు ఇలా గిర్రున తిరిగిపోగా… తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీ పాలనా బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే అమరావతి నిర్మాణ పనుల్లోనూ ఊపు కనిపించింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అడగంగానే కేంద్రం అన్ని పనులూ ఇట్టే చేసేస్తోంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు అప్పుగా ఇప్పించిన కేంద్రం… తాజాగా అమరావతికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ల పనులను ప్రారంబించేందుకు సిద్ధమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. నిర్మాణ పనులను జెట్‌ స్పీడ్‌తో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలని సంకల్పించుకున్న ఏపీ ప్రభుత్వం... అందుకు అనుగుణంగా 8 వేల 603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. అందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్‌ క్యాపిటల్‌ను డిజైన్‌ చేశారు. విశాలమైన రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ పవర్‌ లైన్స్‌, నీటి వసతి, బ్లూ అండ్‌ గ్రీన్‌ కాన్సెప్ట్‌తో ఆహ్లాదకరమైన ప్రపంచ నగరంగా అమరావతి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం, న్యాయ, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్‌ ఫైనాన్స్‌, స్పోర్ట్స్‌, మీడియా, టూరిజం వంటి 9 కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్‌ల్లో 9 నగరాలు ప్లాన్‌ చేశారు.

9 థీముల్లో 9 నగరాలు

Tags

Next Story