రైతులకు సంకెళ్లు వేయడానికి వారేమైనా ఉగ్రవాదులా? - దళిత జేఏసీ

రైతులకు సంకెళ్లు వేయడానికి వారేమైనా ఉగ్రవాదులా? - దళిత జేఏసీ

ఏపీలో దళిత రైతుల పట్ల ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని... అమరావతి దళిత జేఏసీ నేతలు మండిపడ్డారు. దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఏపీలో తప్ప ఇంకెక్కడా చూడలేదన్నారు. రైతులకు సంకెళ్లు వేయడానికి వారేమైనా ఉగ్రవాదులా అని నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులుపెట్టినా... ఎంతమందికి బేడీలు వేసినా... అమరావతిని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. దళిత రైతులకు బేడీలు వేసిన అంశంపై రాష్ట్రపతి జోక్యం చేసుకుని జగన్‌ సర్కారును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దళిత జేఏసీ నేతలు తెలిపారు.

Tags

Next Story